Share News

Karimnagar: నేడు నాగ పంచమి

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:03 AM

కరీంనగర్‌ కల్చరల్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి, గరుడ పంచమిని సోమవారం జరుపుకోనున్నారు. పుట్టలున్న

Karimnagar:  నేడు నాగ పంచమి

కరీంనగర్‌ కల్చరల్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి, గరుడ పంచమిని సోమవారం జరుపుకోనున్నారు. పుట్టలున్న శైవ, వైష్ణవాలయాల్లో భక్తులు పాల్గొని పాలు పోయనుండగా వైష్ణవాలయాల్లో గరుత్మంతుడిని ఆరాధించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు. భక్తులు ఉపవాసాలు పాటిస్తూ పుట్టల వద్దకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పాలు పోసి, ఆవు పాలు, నెయ్యితో కలిపిన నువ్వులు, బియ్యపు ముద్దలను నైవేద్యంగా పెట్టి వెండితో పాము చెవులు, కండ్లు, పడిగె లాంటి అవయవాలు చేసి పుట్టలో వేస్తారు. సర్పసూక్తం, అనంత నాగేంద్ర, సుబ్రహ్మణ్యేశ్వర స్తుతులతో అభిషేక అర్చనలు చేస్తారు. పుట్టమట్టిని బంగారంగా భావించి తిలక ధారణ చేసుకుంటారు.

Updated Date - Aug 17 , 2026 | 12:03 AM