Karimnagar: నేడు గుడ్‌ఫ్రైడే..
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:41 PM
కరీంనగర్ కల్చరల్, ఏప్రిల్2 (ఆంధ్రజ్యోతి) : ఏసుక్రీస్తు శిలువ వేసిన రోజును క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు.
- చర్చిల్లో ప్రత్యేక పార్థనలకు ఏర్పాట్లు
కరీంనగర్ కల్చరల్, ఏప్రిల్2 (ఆంధ్రజ్యోతి) : ఏసుక్రీస్తు శిలువ వేసిన రోజును క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం గుడ్‌ఫ్రైడే నిర్వహించుకుకోనున్నారు. 40 రోజుల ఉపవాసాలను ముగించనున్నారు. శిలువ వేసిన మూడో రోజున ఈస్టర్‌గా ఆదివారం జరుపుకోనుండగా దీనినే పునరుథ్థాన దినంగా చెబుతారు. ఈస్టర్‌కు ముందు 40 రోజుల ఉపవాస కాలాన్ని లెంట్ కాలం అంటారు. ఈ కాలంతో పాటు గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ రోజుల్లో క్రైస్తవులు ఏసును గురించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. గుడ్‌ఫ్రైడే నుంచి వారం రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తారు. ఈస్టర్‌కు ముందు రోజు శనివారం రాత్రి చర్చిల్లో కొవ్వొత్తులు వెలిగిస్తారు. దానధర్మాలతో పాటు బహుమతులు, కేకులు, స్వీట్లు పంచుతారు. ఏసు క్రీస్తు చెప్పిన 7 వాక్యాలను జ్ఙప్తికి తెచ్చుకుంటూ వక్తలు సందేశాలిస్తారు. బైబిల్ పఠనం చేస్తారు. గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ పర్వదిన సందర్భంగా పలు చర్చిలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. ప్రార్థనలు, ప్రసంగాలకు ఆయా చర్చిల యజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి. కమిషనర్ కార్యాలయం వద్ద గల వెస్లీ కెథడ్రిల్, విజయరఘునందన్ రోడ్డు సెయింట్ మార్చ్, క్రిస్టియన్ కాలనీ సెంటినరీ వెస్లీ, సెయింట్ జాన్ స్కూల్ పక్కన గల లూర్దుమాత చర్చిలలో ప్రార్థనలు, ప్రసంగాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఈస్టర్ సందర్భంగా ఉదయం 4 గంటలకు ప్రార్థనలు నిర్వహిస్తారు.