Share News

Karimnagar : జనగణనకు సమాయత్తం

ABN , Publish Date - Mar 02 , 2026 | 02:10 AM

కరీంనగర్‌ టౌన, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జనగణనకు అధికారయంత్రాంగం వేగంగా కసరత్తు చేస్తోంది. కొవిడ్‌ నుంచి నిలిచిపోయిన జనగణన ప్రక్రియను మళ్లీ చేపట్టేందుకు అవసరమైన చర్యలతో సిద్ధమవుతోంది.

Karimnagar :  జనగణనకు సమాయత్తం

- 5 నుంచి మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ

- 120 నుంచి 150 ఇళ్లకు ఒక బ్లాక్‌

- ప్రతి బ్లాక్‌కు ఒక ఎన్యూమరేటర్‌

- ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం

కరీంనగర్‌ టౌన, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జనగణనకు అధికారయంత్రాంగం వేగంగా కసరత్తు చేస్తోంది. కొవిడ్‌ నుంచి నిలిచిపోయిన జనగణన ప్రక్రియను మళ్లీ చేపట్టేందుకు అవసరమైన చర్యలతో సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 1 నుంచి జనగణన జరగనుంది ఎన్యూమరేటర్లుగా ఉపాధ్యాయులను నియమించనుండగా మాస్టర్‌ ట్రైనర్లుగా 34 మంది ఫ్రొఫెసర్లను జిల్లా యంత్రాంగం ఎంపిక చేశారు. వారికి మార్చి 5 నుంచి హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన ట్రైనర్లు జిల్లాలో ఫీల్డ్‌ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. ఫీల్డ్‌ ట్రైనర్లుగా జూనియర్‌ లెక్చరర్లను ఎంపిక చేశారు.

ఫ 120 నుంచి 150 ఇళ్లకు ఒక బ్లాక్‌

జనగణనలో భాగంగా ఇళ్లు, కట్టడాల వివరాలతోపాటు సౌకర్యాల వివరాలను నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా స్మార్ట్‌ఫోనలో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇంటర్నెట్‌ లేకున్నా యాప్‌ పనిచేసే విధంగా రూపొందించారు. నివాసాల సంఖ్యను బట్టి జనగణన కోసం ఎన్యూమరేటర్‌ బ్లాక్‌ను నిర్ణయిస్తారు. 120 నుంచి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజిస్తారు. ఒక్కో బ్లాక్‌కు ఒక ఎన్యూమరేటర్‌ను నియమిస్తారు. కరీంనగర్‌ కార్పొరేషనలో సమీప గ్రామాలను విలీనం చేయడంతో బ్లాకుల సంఖ్య పెరుగగా, విలీన గ్రామాలతో మండలాల్లో బ్లాకుల సంఖ్య తగ్గింది. గత జనగణన సమయంలో కరీంనగర్‌ మున్సిపాలిటీలో 388 బ్లాకులు ఉండగా సమీప గ్రామాల విలీనంతో ప్రస్తుతం బ్లాకు సంఖ్య 808కి చేరింది. గత జనగణనతో పోలిస్తే ఈసారి 420 బ్లాక్‌లు పెరగడంతో ఎన్యూమరేటర్ల సంఖ్య కూడా పెరిగింది.

ఫ యాప్‌లో జనగణన వివరాల నమోదు

స్మార్ట్‌ ఫోనలో జనగణన యాప్‌ డౌనలోడ్‌ చేసుకొని వివరాలను నమోదు చేస్తారు. ఈ యాప్‌ను డౌనలోడ్‌ చేసుకునే సమయంలో ఇంటర్‌నెట్‌ ఉండాలి. ఇంటింటికి వెళ్లి వివరాలను నమోదు చేసే సమయంలో ఇంటర్‌నెట్‌ లేకున్నా పని చేస్తుంది. వివరాలన్నింటిని యాప్‌లోనే నిక్షిప్తం చేస్తారు. వాటిని అప్‌లోడ్‌ చేసే సమయంలో ఇంటర్‌నెట్‌ అవసరముంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ సేవలు అందుబాటులో ఉండని కారణంగా ఆఫ్‌లైన నమోదుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఫ ఎన్యూమరేటర్లకు రెండు దశల్లో శిక్షణ

జనగణన కార్యక్రమానికి ఎన్యూమరేటర్లకు రెండు దశల్లో శిక్షణ ఇస్తారు. ఎన్యూమరేటర్లు వారికి కేటాయించి ప్రాంతాల్లోని ఇళ్లకు వెళ్లి రెండుసార్లు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు మొదటి దశ కింద ప్రతి ఇల్లు, కట్టడం వివరాలు, రెండో దశలో వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. రెండో దశ లెక్కింపును 2027 ఫిబ్రవరిలో నిర్వహిస్తారు.

ఫ జిల్లాలో 2.62 లక్షల నివాసాలు

జిల్లాలో 318 గ్రామపంచాయతీలు, ఒక కార్పొరేషన, మూడు మున్సిపాలిటీలు ఉన్నారు. 2.62 లక్షల నివాసాలున్నట్లు గుర్తించారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాలను ఇందులోనే లెక్కించారు. ఉపాధ్యాయులను ఎన్యూమరేటర్లుగా, పర్యవేక్షకులుగా స్కూల్‌ అసిస్టెంట్లు, హెడ్మాస్టర్లు, ఎంఆర్‌సీలను నియమించనున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన పరిధిలో 808 మంది ఉపాధ్యాయులను ఎన్యూమరేటర్లుగా నియమిస్తారు. వీరంతా రెండు దశల్లో ఇంటింటికి వెళ్లి సమగ్రంగా వివరాలను జనగణన ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి ప్రభుత్వానికి పంపిస్తారు.

Updated Date - Mar 02 , 2026 | 02:10 AM