Share News

Karimnagar: టికెట్‌ ప్లీజ్‌..

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:09 AM

జమ్మికుంట, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ రాక ముందె టికెట్‌ ప్లీజ్‌.. అంటూ ఆశావాహులు నేతల ఇళ్ల చుట్టూ ప్రధిక్షణలు చేస్తున్నారు.

 Karimnagar:   టికెట్‌ ప్లీజ్‌..

- ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు

- ఆ ప్రస్తావన ఇప్పుడే వద్దంటున్న నేతలు

జమ్మికుంట, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ రాక ముందె టికెట్‌ ప్లీజ్‌.. అంటూ ఆశావాహులు నేతల ఇళ్ల చుట్టూ ప్రధిక్షణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆరెస్‌, బీజేపీ నేతలకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ప్రధాన పార్టీల టికెట్లు సొంతం చేసుకోవడానికి ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. చైర్మన్‌ పదవి ఎస్సీ జనరల్‌, ఎస్టీ 1, ఎస్సీ 6, బీసీ 8, జనరల్‌ 15 స్థానాలు రిజర్వ్‌ అయ్యాయి. ఒక్కో వార్డు నుంచి ప్రధాన పార్టీల టికెట్లు ఆశిస్తున్న వారు ముగ్గురు, నలుగురు ఉన్నారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధుల ఎంపికలో నూతన ఒరవడికి శ్రీకారం చూడుతున్నాయి. జంపింగ్‌ జపాంగ్‌లను, రెబల్‌ అభ్యర్ధులుగా పోటిలో ఉండేవారిని కట్టడి చేసేందుకు పకడ్బందీగా వ్యూహరచన చేస్తున్నాయి. ఒక్కో వార్డులో టికెట్‌ ఆశిస్తున్న వారి పేర్లతో వార్డుల వారీగా సర్వే నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపితే వారికే టికెట్‌ ఖరారు అవుతుందని చెబుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అసమ్మతి గళాలు వినిపించకుండా టికెట్‌ ఆశిస్తున్న అందరితో నామినేషన్లు వేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అధిష్ఠానం ఎవరికి టికెట్‌ కేటాయిస్తే వారి గెలుపు కోసం మిగితా వారంతా కృషి చేయాలని చెబుతున్నారు. ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే టికెట్‌ రాని వారు మిగితా పార్టీల వైపు తొంగిచూసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటికి తావు ఇవ్వకుండా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 26 , 2026 | 12:10 AM