Share News

Karimnagar: కార్మికులను వేధిస్తున్న వారిని సస్పెండ్‌ చేయాలి

ABN , Publish Date - May 26 , 2026 | 11:33 PM

కరీంనగర్‌ టౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న అదనపు కమిషనర్‌ సువార్తను సస్పెండ్‌ చేయాలని,

Karimnagar:  కార్మికులను వేధిస్తున్న వారిని సస్పెండ్‌ చేయాలి

- మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

కరీంనగర్‌ టౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న అదనపు కమిషనర్‌ సువార్తను సస్పెండ్‌ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా కార్మికులతో ఇళ్లలో పనులు చేయించుకోవడం బంద్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సీఐటీ యు, బీఆర్‌టీయు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సంద ర్భంగా బీఆర్‌టీయు జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్‌ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న అదనపు కమిషనర్‌ సువార్త మున్సిపల్‌ నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లలో పనులు చేయిం చుకుంటూ కార్మికులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఏ సమస్య వచ్చినా పాలకవర్గం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికురాలిపై థర్డ్‌ డిగ్రీ చేయించిన సువార్తను సస్పెండ్‌ చేయాలని, పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌టీయు అనుబంధ యూనియన్‌ నగర అధ్యక్షుడు గడ్డం సంపత్‌, సీఐటీ యు నాయకులు జనగాం రాజమల్లు, పొన్నం లింగయ్య, కవ్వంపల్లి రవి, పి. ఎల్లయ్య, మాతంగి లక్ష్మన్‌, దాంపెల్లి రాయమల్లు, మాతంగి స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఫ మేయర్‌కు వినతి

మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌తో కార్మిక సంఘం నాయకులు కార్మికుల సమస్యలను వివరించి వాటిని పరిష్కరించాలని విన్నవించారు. అదనపు కమిషనర్‌ సువార్తను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేయగా, మేయర్‌ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - May 26 , 2026 | 11:34 PM