Share News

Karimnagar: ఎండ ప్రచండం..

ABN , Publish Date - May 21 , 2026 | 11:23 PM

కరీంనగర్‌ టౌన్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం ఎండలు దంచికొట్టాయి.

 Karimnagar:  ఎండ ప్రచండం..

కరీంనగర్‌ టౌన్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం ఎండలు దంచికొట్టాయి. గంగాధర మండల కేంద్రం, జమ్మికుంట మండలం కొత్తపల్లి-ధర్మారంలో 46.4, ఇల్లందకుంట మండలం మల్యాల, చొప్పదండి మండలం వెదురుగట్టలో 46.3, వీణవంక మండల కేంద్రంలో 46.2, రామడుగు మండలం గుండి, జమ్మికుంట మండలం తనుగులలో 46, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో 45.9, చిగురుమామిడి మండలం ఇందుర్తిలో 45.7, సైదాపూర్‌ మండలం వెన్కేపల్లి, మానకొండూర్‌ మండలం గంగిపల్లిలో 45.6, జమ్మికుంటలో, గంగాధర మండలం బూరుగుపల్లి, గన్నేరువరం కాసీంపేటలో 45.5, కొత్తపల్లి మండలం చింతకుంటలో 45.3, మానకొండూర్‌ మండలం పోచంపల్లిలో 45.1, కరీంనగర్‌, కరీంనగర్‌ రూరల్‌ మండలం దుర్షేడ్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లో వాతారణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

తిమ్మాపూర్‌ మండలం రేణికుంట, మానకొండూర్‌ మండలం ఈదులగట్టెపల్లిలో 44.9, శంకరపట్నం మండలం తాడికల్‌లో 44.7, చిగురుమామిడి, శంకరపట్నం మండలం కొత్తగట్టులో 44.6, చొప్పదండి మండలం ఆర్నకొండ, మానకొండూర్‌ మండలం గట్టుదుద్దెనపల్లి, హుజూరాబాద్‌ మండలం బోర్నపల్లిలో 44.5, తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

అయ్యయ్యో.. చిలుకమ్మ

హుజూరాబాద్‌: రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దీంతో ప్రజలతో పాటు పక్షులు కూడా భానుడు భగభగకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురువారం హుజూరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని బోర్నపల్లిలో ఎండ తీవ్రతను తట్టుకోలేక రామచిలుక రోడ్డుపైనే మృతి చెందింది. అటూగా వెళ్తున్న వారు దానిని చూసి రోడ్డుపై నుంచి తొలగించారు. ఎండల నేపథ్యంలో మూగజీవాల పట్ల మానవత ధృక్పథంతో వ్యవహరించాలని సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్‌ అన్నారు. ఇంటి ఆవరణలో, బాల్కానీల్లో పక్షులు నీళ్లు తాగేందుకు వీలుగా పాత్రలను ఏర్పాటు చేయాలన్నారు.

Updated Date - May 21 , 2026 | 11:23 PM