Karimnagar: రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్‌యార్డును రద్దు చేయాల్సిందే..
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:34 AM
హుజూరాబాద్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో ఏర్పాటు చేసే డంపింగ్‌యార్డును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిందేనని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు.
- ఎమ్మెల్సీ అంజిరెడ్డి
హుజూరాబాద్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో ఏర్పాటు చేసే డంపింగ్‌యార్డును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిందేనని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. హుజూరాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేసే డంపింగ్‌యార్డు స్థలాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ నాలుగు జిల్లాల చెత్తను తీసుకొస్తే హుజూరాబాద్ ప్రాంతంలో వేస్తే ఈ ప్రాంత భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. డంపింగ్‌యార్డు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సరికాదన్నారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని ఈ ప్రాంత ప్రజలు బతుకుతున్నారన్నారు. నెల రోజులుగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. డంపింగ్‌యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు తూర్పాటి రాజు, పారిపెల్లి కొండాల్‌రెడ్డి, మాడ వెంకట్‌రెడ్డి, రమణారెడ్డి, సుమలత, మనోజ్, అనూష, లక్ష్మిదుర్గ, మహేష్, పైళ్ల వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, శశిధర్, రమేష్ పాల్గొన్నారు.