Karimnagar: భగీరథ మహర్షి సంకల్పం నేటి తరానికి ఆదర్శం
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:36 AM
కరీంనగర్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భగీరథ మహర్షి పట్టుదల, సంకల్పం నేటి తరానికి ఆదర్శమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భగీరథ మహర్షి పట్టుదల, సంకల్పం నేటి తరానికి ఆదర్శమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఉన్నతాధికారులు, సగర సంఘం నాయకులు భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సగర కులస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అందించే విద్య, స్కాలర్‌షిప్స్, విద్యాలయాల్లో సీట్లు, రుణాలపై సంఘ నాయకులకు అవగాహన కల్పించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని బీసీ సంక్షేమ అధికారి అనిల్‌ప్రకాశ్‌ను ఆదేశించారు. త్వరలో అధికారులు సంఘం సభ్యులతో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంపై అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు. లేబర్ కార్డుల జారీలో ఇబ్బందులు లేకుండా, వాటిద్వారా ప్రయోజనం అందేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, వివిధశాఖల ఉన్నతాధికారులు, జడ్పీ సీఈవో శ్రీనివాస్, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవుని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కట్ట రాజు, కోశాధికారి కుమారస్వామి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కాసుగంటి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు జ్యోతి మల్లయ్య, మంజుల వాసు, కట్ట శ్రీనివాస్, గుంటి రాజయ్య, నులుబాల వేణుగోపాల్, గుంటి తిరుపతి, కురుమండ్ల మల్లయ్య, బోడిపల్లి కుమార, భాగ్య, గుంతి ఈశ్వరమ్మ, కోమల, లక్ష్మి పాల్గొన్నారు.