Karimnagar: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:09 PM
సుభాష్‌నగర్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు.
సుభాష్‌నగర్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి కనీస వేతనం 26 వేల అమలు చేయాలన్నారు. పంచాయతీ కార్మికుల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని, పంచాయతీల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీల వారికి రెండో పీఆర్సీని వర్తింప జేయాలన్నారు. కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల శంకర్ మాట్లాడుతూ జీవో నం. 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి పాత కేటగిరీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్కపల్లి సారయ్య, ఆకునూరి సుధాకర్, బొజ్జా మదు, లక్ష్మి, రుద్రారపు నాంపెల్లి, వడ్లూరి లక్ష్మీనారాయణ, ఎండిగ రవీందర్‌రావు, కాశిపాక శంకర్, దాసాపు జంపయ్య, పోతుల రమేష్, గాజర్ల రాజు, లద్దునూరి కుమార్, పెరుగు అశోక్, భిక్షపతి పాల్గొన్నారు.