Share News

Karimnagar: ప్రభుత్వమే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:22 AM

కరీంనగర్‌ రూరల్‌/భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వమే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు.

 Karimnagar:   ప్రభుత్వమే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది

-మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్‌ రూరల్‌/భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వమే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రాంరంభించారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కేంద్రాల్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి తీసుకోవల్సిన చర్యలపై అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంట మార్పిడితో భూమి సారవంతం అవుతుందని, ప్రత్యామ్నాయ పంటలతో దిగుబడి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో చొప్పదండి, మానకొండూర్‌ నియోజకవర్గాల్లోతప్ప ఎక్కడ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఎండితోమాట్లాడితే కొనుగోళ్ళకు ముందుకు వచ్చారన్నారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో మూడు వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, ఇందుకనుగణంగా కరీంనగర్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌లో, కొత్తపల్లి మండలం మల్కాపూర్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సర్దార్‌ రవీందర్‌సింగ్‌, అశోక్‌, సుదగోని మాధవి, వ్యవసాయ మార్కెట్‌ మాజీ చైర్మన్‌ మధు, సుంకిశాల సంపత్‌రావు, సాయిని తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 12:22 AM