Share News

Karimnagar: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:57 PM

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్‌-అలైవ్‌’ రోడ్‌ సేఫ్టీ క్యాంపెయిన్‌ అమలుపై పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Karimnagar:  రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

- ‘అరైవ్‌-అలైవ్‌’పై సీపీ గౌస్‌ ఆలం సమీక్ష

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్‌-అలైవ్‌’ రోడ్‌ సేఫ్టీ క్యాంపెయిన్‌ అమలుపై పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యా చరణలో భాగంగా, ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు వారంరోజుల పాటు ప్రత్యేక కార్యక్ర మాలను నిర్వహించనున్నట్లు సీపీ వెల్లడించారు. సమీక్షా సమావేశంలో పోలీస్‌కమిషనర్‌ గౌస్‌ ఆలం మాట్లాడుతూ.. వారం రోజుల పాటు రోజుకో ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసి, స్థానిక ప్రజలకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడం, వాహనదారులు, విద్యార్థులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా సామూహిక ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను(బ్లాక్‌ స్పాట్స్‌) గుర్తించి, అక్కడ తక్షణమే హెచ్చరిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్స్‌, రోడ్‌ మార్కింగ్స్‌ను పునరుద్ధరించాలని తెలిపారు. పాఠశాలల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు, చిన్నతనం నుంచే ట్రాఫిక్‌ క్రమశిక్షణ అలవడేలా విద్యార్థులకు అవగాహన కల్పించడం, ఆటో, బస్సు, లారీ డైవ్రర్లకు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి, హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ప్రాముఖ్యతను వివరించాలని తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి గంట(గోల్డెన్‌ అవర్‌)లో బాధితులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్స, సహాయంపై ప్రజలకు వివరించడం, వారంలో ఒక రోజు ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై జరిమానాలు విధించకుండా, కేవలం కౌన్సెలింగ్‌ ద్వారా వాహన దారుల్లో మార్పు తీసుకురావడం కార్యక్రమాలను చేపట్టనున్నట్లు సీపీ తెలిపారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత, నిబంధనల పట్ల నిర్లక్ష్యం ప్రాణనష్టానికి దారితీస్తుందన్నారు. అరైవ్‌-అలైవ్‌ లక్ష్యం నెరవేరాలంటే డ్రైవర్లు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సురక్షిత ప్రయాణం - సుఖమయ జీవనం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటిం చాలని ఆయన కోరారు.

Updated Date - Apr 10 , 2026 | 11:57 PM