Share News

Karimnagar: ఆదమరిస్తే అంతే..

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:14 PM

మానకొండూర్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొండపల్కల-కెల్లేడు గ్రామాల మధ్య ఉన్న లో లెవల్‌ బ్రిడ్జిపై భారీ గుంత ఏర్పడింది.

Karimnagar:   ఆదమరిస్తే అంతే..

- లో లెవల్‌ బ్రిడ్జిపై ప్రమాదకరంగా గుంత

మానకొండూర్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొండపల్కల-కెల్లేడు గ్రామాల మధ్య ఉన్న లో లెవల్‌ బ్రిడ్జిపై భారీ గుంత ఏర్పడింది. రెండు గ్రామాల ప్రజలతో పాటు రైతులు, రైతు కూలీలు, ప్రయాణికులు ఈ దారిలో వెళ్లాలంటే భయపడుతున్నారు. వర్షాకాలంలో కురిసిన వర్షాలకు వంతెన మధ్య పెద్ద గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఈ దారిలో వెళుతుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాహనాలు ఈ గుంతలో పడి ప్రమాదాలు జరిగే అవకాశ ఉంది. రాత్రి వేళల్లో పొలాల వద్దకు నీరు పెట్టడానికి రైతులు వెళుతుంటారు. అధికారులు చొరవ తీసుకొని మరమ్మతులు చేయించాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jan 09 , 2026 | 11:14 PM