Karimnagar: ఆస్తిపన్నుపై 5శాతం రాయితీని సద్వినియోగం చేసుకోండి
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:09 PM
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరపు ఆస్తిపన్ను మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించిన వారికి 5 శాతం రిబేట్‌ను ఇస్తుందని,
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరపు ఆస్తిపన్ను మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించిన వారికి 5 శాతం రిబేట్‌ను ఇస్తుందని, ఈ పథకాన్ని నగర ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన రెవెన్యూ అధికారులతో కలిసి మున్సిపల్ పౌరసేవా కేంద్రాన్ని సందర్శించి ఆస్తిపన్ను చెల్లింపులను పరిశీలించారు. ఎర్లీబర్డ్ స్కీమ్‌లో ప్రజలు పన్నులు చెల్లిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్తిపన్ను చెల్లింపులపై ఐదు శాతం రాయితీని సద్వినియోగం చేసుకొని పన్నులు చెల్లించేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తుండడంతో కౌంటర్లను పెంచడంతోపాటు సీనియర్ సిటిజన్లు, మహిళల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున తాగునీరు, కూలర్లు, కూర్చునేందుకు వీలుగా ఫర్నీచర్ ఏర్పాటు చేయాలన్నారు. ఒకేసారి ఆస్తిపన్నులు చెల్లించడం ద్వారా ఐదుశాతం రాయితీతోపాటు వడ్డీ భారం తగ్గుతుందన్నారు. పన్నులుచెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని మేయర్ ప్రజలను కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మోహియుద్దీన్, ఆర్‌వో శివప్రసాద్, కార్పొరేటర్లు గాజ రమశివరాం, బండ రమణారెడ్డి, అపర్ణజితేందర్, చంద్ర, సోమిడి వేణు పాల్గొన్నారు.