Karimnagar: విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలి
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:59 PM
హుజూరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఆంజనేయరావు అన్నారు.
హుజూరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఆంజనేయరావు అన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ప్రథమ సంవత్సరం విద్యార్థులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలకు రెగ్యులర్‌గా రావాలన్నారు. పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ తులసీదాస్, అధ్యాపకులు వాసుదేవరావు, రాజశేఖర్, విజేందర్‌రెడ్డి, రమణ పాల్గొన్నారు.