Share News

Karimnagar : ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:35 AM

కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషనతో పాటు జమ్మికుంట, హుజురాబాద్‌, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని పోలీస్‌ కమిషనర్‌ గౌ్‌స్‌ ఆలం తెలిపారు.

Karimnagar : ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు

- పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషనతో పాటు జమ్మికుంట, హుజురాబాద్‌, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని పోలీస్‌ కమిషనర్‌ గౌ్‌స్‌ ఆలం తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం కమిషనరేట్‌ కేంద్రంలో జిల్లా పోలీసు అధికారులతో సీపీ సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనల అమలు కోసం జిల్లా వ్యాప్తంగా 4 స్టాటిక్‌ సర్వేలెన్ప టీములు, 4 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీములు నిరంతరం పని చేస్తున్నాయన్నాారు. గత ఎన్నికల్లో నేరస్థులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘ విద్రోహ వ్యక్తులను గుర్తించి వారిని ఇప్పటికే బైండ్‌ ఓవర్‌ చేస్తున్నట్లు సీపీ తెలిపారు. జిల్లాలో వ్యక్తిగత లైసెన్స ఆయుధాలను వందశాతం డిపాజిట్‌ అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషనలోని 66 వార్డులను వివిధ క్లస్టర్లుగా విభజించామని, ఏదైనా సమస్య తలెత్తితే నిమిషాల్లో స్పందించేలా మల్టిపుల్‌ పెట్రోలింగ్‌ పార్టీలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. బందోబస్తు ప్రణాళికలో భాగంగా ప్రతి రెండు రూట్లకు ఒక ఇనస్పెక్టర్‌ స్థాయి అధికారిని, ప్రతి నాలుగు రూట్లకు ఒక ఏసీపీ స్థాయి అధికారిని పర్యవేక్షకులుగా నియమించినట్లు సీపీ గౌస్‌ ఆలం తెలిపారు. కార్పొరేషన పరిధిలో 25 శాతం కేంద్రాలను క్రిటికల్‌(సున్నితమైనవి)గా గుర్తించామని, అక్కడ వెబ్‌ కాస్టింగ్‌, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటర్లు, ప్రజలకు ఎన్నికల నియమ నిబంధనలపై పోలీసు శాఖ తరపున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని సీపీ గౌస్‌ ఆలం కోరారు.

ఫ సా్ట్రంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల పరిశీల.

కరీంనగర్‌ క్రైం/కరీంనగర్‌ టౌన: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీస్‌ కమిషనర్‌ గౌ్‌స్‌ ఆలం ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. మున్సిపల్‌ కమీషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌తో కలిసి ఆయన కరీంనగర్‌ కార్పొరేషన ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సా్ట్రంగ్‌రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయబోయే కౌంటింగ్‌ కేంద్రాలను, సా్ట్రంగ్‌ రూమ్‌లను సీపీ పరిశీలించారు. భవనాల సామర్థ్యం, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, సీసీటీవీ నిఘా ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సా్ట్రంగ్‌ రూమ్‌ల వద్ద నిరంతరం కట్టుదిట్టమైన నిఘా ఉండాలని, బందోబస్తు విషయంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. పోలీస్‌, మున్సిపల్‌ శాఖలు సమన్వయంతో పనిచేసి ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో అడిషనల్‌ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి, ఇనస్పెక్టర్లు రాంచందర్‌రావు, సృజనరెడ్డి, తిరుమల్‌గౌడ్‌, కరీముల్లా ఖాన సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 01:35 AM