Share News

Karimnagar: పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:16 AM

మానకొండూర్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Karimnagar:    పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

మానకొండూర్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని అన్నారం, రాఘవాపూర్‌, చెంజర్ల, ఖాదర్‌గూడెం, నిజాయితీగూడెం, లలితాపూర్‌, కొండపల్కల గ్రామాల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికాలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, రోడ్ల స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సర్‌ కార్యక్రమంలో భాగంగా ఓటర్‌ జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగిస్తారన్నారు. నిజాయితీగూడెంలో డిప్యూటీ సీఈవో పవన్‌కుమార్‌, చెంజర్లలో డీఆర్‌డీవో పీడీగీత, ఎంపీడీవో వరలక్ష్మీ, లలితాపూర్‌లో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీవో సతీష్‌రావు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 12:16 AM