Share News

Karimnagar: జిల్లాపై మంచు దుప్పటి

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:55 PM

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయ పొగమంచు అలుముకుంది. ఉదయం 10 గంటల వరకు మంచు ప్రభావం ఉంది.

 Karimnagar:  జిల్లాపై మంచు దుప్పటి

హుజూరాబాద్‌/శంకరపట్నం/మానకొండూర్‌/సైదాపూర్‌/కరీంనగర్‌ రూరల్‌/వీణవంక, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయ పొగమంచు అలుముకుంది. ఉదయం 10 గంటల వరకు మంచు ప్రభావం ఉంది. రహదారులపై వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకొని ప్రయాణించారు. కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారి, రాజీవ్‌ రహదారితోపాటు గ్రామాల్లో రోడ్లపై వెళ్లే వాహనదారులు, పనులకు వెళ్లే రైతులు, కూలీలు పొగ మంచుతో ఇబ్బందులు పడ్డారు. 10 గంటల తరువాత కొంచెం కొంచెం పొగ మంచు వీడింది. పొగమంచుతో ఇబ్బంది పడ్డా ఊటీలో ఉండే వాతావరణం ఇక్కడ కనిపించిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 02 , 2026 | 11:55 PM