Share News

Karimnagar: ‘సర్‌’ను వేగంగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:02 AM

కరీంనగర్‌ టౌన్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను మరింత వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌

Karimnagar:  ‘సర్‌’ను వేగంగా పూర్తి చేయాలి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను మరింత వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ అధికారులను ఆదేశించారు. ఆయన నగరంలో చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ మ్యాపింగ్‌ ప్రక్రియను గురువారం పరిశీలించారు. జ్యోతినగర్‌, మంకమ్మతోట, రేకుర్తి తదితర డివిజన్ల పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి ఓటర్ల నమోదు, మార్పుల ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. బీఎల్‌వోలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పాదర్శకంగా పూర్తిచేయాలన్నారు. సేకరించిన ఎన్యుమరేషన్‌ ఫారాల డేటాను ఎలాంటి తప్పులు, సాంకేతిక లోపాలు లేకుండా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. నగర పరిధిలో సర్‌ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తిచేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ కోరారు.

Updated Date - Jul 10 , 2026 | 12:02 AM