Share News

Karimnagar: రేపటి నుంచి ఒంటి పూట బడులు

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:53 PM

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 14: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రతియేడు మాదిరిగానే ఈసారి ఎండలు మండిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

Karimnagar:   రేపటి నుంచి ఒంటి పూట బడులు

- ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు

- ‘పది’ పరీక్షా కేంద్రాల్లో 1 నుంచి సాయంత్రం 5 వరకు

- ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 14: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రతియేడు మాదిరిగానే ఈసారి ఎండలు మండిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉదయం వేళల్లో మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మాత్రమే తరగతులను నిర్వహించాలని సూచించింది. మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు భోజనం అందించాలని సూచించింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయం త్రం 5 గంటల వరకు తరగతులను నిర్వహించాలని పేర్కొంది. ఈ విద్యా సంవత్సరం చివరిరోజైన ఏప్రిల్‌ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్‌ 12న పాఠశాలలను పునఃప్రారంభిస్తారు.

Updated Date - Mar 14 , 2026 | 11:53 PM