Karimnagar: ప్రత్యేక విద్యార్థులకు చేసే సేవే దైవసేవతో సమానం
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:05 AM
తిమ్మాపూర్ (మానకొండూర్), ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు చేసే సేవే
- మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
తిమ్మాపూర్ (మానకొండూర్), ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు చేసే సేవే దైవసేవతో సమానమని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని మహత్మానగర్ మానసిక వికలాంగుల పాఠశాల వార్షికోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతీ ఒక్కరు చేయూతనివ్వాలన్నారు. వారు దేవుళ్ళతో సమానమన్నారు. తాను సీఎంతో ప్రత్యేకంగా చర్చించి శాశ్వతంగా ఏలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. ట్రస్టు చైర్మన్ చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు సహకరిస్తున్న వారికి కృతజ్ఙతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు వెంకటయ్య, ఇండస్ర్టీ జీఎం సల్మాన్‌రాజు, సీనియర్ జర్నలిస్టు ఈద మధుకర్‌రెడ్డి, సర్పంచ్ సంపత్, ప్రిన్సిపాల్ సతీష్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.