Karimnagar: పనిచేయని సర్వర్.. నిలిచిన రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:20 PM
తిమ్మాపూర్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సాంకేతిక సమస్య కారణంగా శనివారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
- వెనుతిరిగిన క్రయ, విక్రయదారులు
తిమ్మాపూర్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సాంకేతిక సమస్య కారణంగా శనివారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. తిమ్మాపూర్ మండలంతో పాటు గన్నేరువరం, చిగురుమామిడి, మానకొండూర్ మండలాలకు సంబంధించిన రిజిస్ర్టేషన్లు ఇక్కడ జరుగుతాయి. ప్రతి రోజు సుమారు 10-20 ఆపై రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. శనివారం సాంకేతిక సమస్య కారణంగా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదని ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ నిరంజన్, కార్యాలయ సిబ్బంది తెలిపారు. స్లాట్లను బుక్ చేసుకొని కార్యాలయానికి వచ్చిన క్రయ విక్రయదారులు సాయంత్రం వరకు వేచి చూసి నిరాశతో వెనుతిరిగారు.
సర్వర్ సమస్య వల్ల రిజిస్ట్రేషన్లు జరగలేదు
నిరంజన్, ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్, తిమ్మాపూర్
సర్వర్ సమస్య వల్ల శనివారం రిజిస్ట్రేషన్లు జరగలేదు. సైట్ తెరుచుకుంటేనే ఎన్ని స్లాట్‌లు ఉన్నయని తెలుస్తుంది. ఈ రోజు నేను వచ్చినప్పటి నుంచి సర్వర్ పనిచేయడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్లు కాలేదు. వారికి సోమవారం రావాల్సిందిగా తెలిపాం.