Share News

Karimnagar: స్కాలర్‌షిప్స్‌ విడుదల చేయాలి

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:56 PM

కరీంనగర్‌ రూరల్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ వెంటనే విడుదల చేయాలని, స్కాలర్‌షిప్‌ భిక్ష కాదని, హక్కు అని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ పూసాల విష్ణు అన్నారు.

Karimnagar:  స్కాలర్‌షిప్స్‌ విడుదల చేయాలి

- ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల రాస్తారోకో

కరీంనగర్‌ రూరల్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ వెంటనే విడుదల చేయాలని, స్కాలర్‌షిప్‌ భిక్ష కాదని, హక్కు అని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ పూసాల విష్ణు అన్నారు. సోమవారం కరీంనగర్‌ శివారు బొమ్మకల్‌ బైపాస్‌లో కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. విద్యాశాఖలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ రాష్ట్ర బెడ్జట్‌లో విద్యారంగానికి కనీసం 15శాతం బడ్జెట్‌ కేటాయించకుండా కుట్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. విద్యా కమిషన్‌ నివేదికను తిరస్కరించాలని అన్నారు. ఇంజనీరింగ్‌ ఫార్మా కళాశాలల్లో ఫీజులపెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యాశాఖలో ఇప్పటి వరకుపూర్తి స్థాయి మంత్రి లేకపోవడంతో విద్యారంగంలో అనేక కీలక నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హాస్టల్స్‌ కో కన్వీనర్‌ నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ, నగర కార్యదర్శి యోగేష్‌,శివ, ఆకాశ్‌, అజయ్‌, యశ్వంత్‌, కాపీ, నాగరాజ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:56 PM