Karimnagar: నిబంధనల ప్రకారమే ఇసుక క్వారీ నిర్వహించాలి
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:33 PM
తిమ్మాపూర్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక క్వారీ నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
- కలెక్టర్ పమేలా సత్పతి
తిమ్మాపూర్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక క్వారీ నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని కొత్తపల్లి పరిధిలోని ఇసుక క్వారీని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎల్‌ఎండీ రిజర్వాయర్ నుంచి పూడిక తీసి ఇసుకను వేరు చేసే విధానాన్ని ఆమె పరిశీలించారు. రికార్డులు, వే బిల్లులు తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిర్దిష్ట పరిమితికి మించి ఇసుక తరలించినా, కేటాయించిన వాహనాలు కాకుండా ఇతర వాహనాలు క్వారీలోకి వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనం వివరాలు లోడింగ్ పరిమితి, వే బిల్లులు వంటివి రికార్డు చేయాలని, నిర్దిష్ట వేళల తర్వాత ఇసుక లోడింగ్ చేయవద్దని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
- అక్రమాలు బయటపడితే కేసులు నమోదు చేస్తాం
- సీపీ గౌస్‌ఆలం
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక కేటాయింపు ఉండాలని, తనిఖీల్లో అక్రమాలు బయటపడితే కేసులు నమోదు చేస్తామని సీపీ గౌస్ ఆలం నిర్వాహకులను హెచ్చరించారు. లోడింగ్, వెయింగ్ సమయంలో నిర్ధిష్ట ప్రమాణాలు పాటించాలని సూచించారు. సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని సీపీ గౌస్ అలం అదేశించారు. కార్యక్రమంలో టీడీఎండీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వినయ్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, డీఈఈ శ్రీనివాస్, ఏఈఈ సంజన, ఏఈ వంశీధర్ పాల్గొన్నారు.