Share News

Karimnagar: రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: సీపీ గౌస్‌ ఆలం

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:17 AM

హుజూరాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియామాలు పాటిస్తే ప్రమాదాలు జరగవని సీపీ గౌస్‌ఆలం అన్నారు.

 Karimnagar:   రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: సీపీ గౌస్‌ ఆలం

హుజూరాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియామాలు పాటిస్తే ప్రమాదాలు జరగవని సీపీ గౌస్‌ఆలం అన్నారు. గురువారం మండలంలోని సింగాపూర్‌ శివారులోని లింగాపూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద యాక్సిడెంట్‌ బ్లాక్‌స్పాట్స్‌ గుర్తించి ఏసీపీ మాధవితో కలిసి ప్రమాద సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. అనంతరం సింగాపూర్‌ కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాన్ని నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాన్ని నడపవద్దన్నారు. అనంతరం మున్సిపల్‌ ఎన్నికల్లో వలంటీర్లుగా పనిచేసిన ఎన్‌సీసీ కేడెట్లకు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శంకర్‌, ఎంవీఐ వేణు, సీఐలు కరుణాకర్‌, వెంకట్‌, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

- డ్రైవర్లకు కంటిచూపు అత్యంత కీలకం

జమ్మికుంట: డ్రైవర్లకు కంటిచూపు అత్యంత కీలకమని సీపీ గౌస్‌ ఆలం అన్నారు. పట్టణంలో సీపీ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. డ్రైవర్లకు వైద్యులు కంటి పరీక్షలు చేసి, అవసరం ఉన్నవారికి కళ్లజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కంటిచూపు సరిగ్గా లేకపోతే వాహనాలు నడిపే క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయన్నారు. ప్రతి డ్రైవర్‌ కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు. డ్రైవర్లు సహకరిస్తేనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి, సీఐలు ఎస్‌ రామకృష్ణగౌడ్‌, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:17 AM