Karimnagar: లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై సమీక్ష
ABN , Publish Date - Jul 30 , 2026 | 11:48 PM
సుభాష్‌నగర్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ అధ్యక్షతన పిసి అండ్ పిఎన్‌డిటి జిల్లా అడ్వయిజరీ కమిటీ సమావేశం
సుభాష్‌నగర్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ అధ్యక్షతన పిసి అండ్ పిఎన్‌డిటి జిల్లా అడ్వయిజరీ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లాలో లింగనిర్ధారణ నిషేధ చట్టంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ లింగనిర్ధారణ నిషేధ చట్టం ప్రకారం స్కానింగ్ సెంటర్లు, గర్భంలోని పిండం ఆడ, మగ శిశువు గర్భిణికి, వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడం నేరమన్నారు. ఈ చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ చర్యలకు పాల్పడుతున్న వారి సమాచారాన్ని జిల్లా ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో తెలియజేయాలన్నారు. తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతుందన్నారు. జిల్లాలో అనుమతి పొందిన స్కానింగ్ సెంటర్లను క్రమబద్ధంగా తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. లింగనిర్ధారణ పరీక్షలు నేరమని తెలియజేసే బోర్డులు స్కానింగ్ కేంద్రాలలో ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఓపిసి పిఎన్‌డిటి డాక్టర్ సనా జవేరియా, పిఓడిటిటి డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ పద్మజా, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ దివ్య, డెమో శ్రీనివాస్, అడ్వైజరీ కమిటీ సభ్యులు, కౌక రమేష్ తదితరులు పాల్గొన్నారు.