Karimnagar: డంపుయార్డును తొలగించండి
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:02 AM
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): నగరంలోని బైపాస్‌రోడ్డులో గుట్టలా పేరుకుపోయి తమ ప్రాణాలకు హాని కలిగిస్తున్న డంపింగ్ యార్డును వెంటనే తొలగిం చాలని డిమాండ్ చేస్తూ డంపుయార్డు బాధితులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
- మున్సిపల్ ఎదుట బాధితుల నిరసన
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): నగరంలోని బైపాస్‌రోడ్డులో గుట్టలా పేరుకుపోయి తమ ప్రాణాలకు హాని కలిగిస్తున్న డంపింగ్ యార్డును వెంటనే తొలగిం చాలని డిమాండ్ చేస్తూ డంపుయార్డు బాధితులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు, డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మోహియుద్దీన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంపుయార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసన, హాని కర వాయువులు, కాలుష్యం కారణంగా సమీపంలోని ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది మరింత ప్రమాదకరంగా మారిందని అన్నారు. డంపు యార్డును తొలగించి, నగరానికి దూరంగా ప్రజలకు హాని కలగని ప్రదేశంలోకి తరలించాలని అన్నారు. వ్యర్థాల నిర్వహణలో ఆధునిక పద్ధతులు అమలు చేయాల న్నారు. కార్యక్రమంలో డంపుయార్డు బాధితులు గోగుల రామన్న, దుంపటి రాము, మనోజ్‌కుమార్, ఇజగిరి శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్, జగదీష్, చంద్రమౌళి, కోట శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.