Karimnagar: ఎండ నుంచి ఉపశమనం... శరీరానికి చల్లదనం..
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:56 PM
సుభాష్‌నగర్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : వేసవిలో కీరా దోసకాయ ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చల్లదనానిచ్చే దోసకాయ తింటే ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- వేసవిలో దోసకాయ తింటే మేలు
- బహుళ ప్రయోజనాలు ఉండడంతో గిరాకీ
సుభాష్‌నగర్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : వేసవిలో కీరా దోసకాయ ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చల్లదనానిచ్చే దోసకాయ తింటే ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే 90 శాత నీరు శరీరాన్ని చల్లబరుస్తుంది. దీంతోపాటు పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, పైబర్ పోషకాలు ఉండడంతో శరీరం హైడ్రేటేడ్‌గా ఉంటుంది. ఈసారి మార్చి ప్రారంభం నుంచే ఎండలు ప్రభావం చూపుతున్నాయి. ఇటాంటి సమయంలో దోసకాయ తింటే శరీరానికి చలువతోపాటు ఆరోగ్యం చేకూరుతుంది. దోసకాయల్లో కీరదోస, కూరదోస రెండు రకాలు. కీరదోస కాయలకు కాస్త ఉప్పంటిస్తే మరింత రుచిగా ఉంటాయి. తాజా దోసకాయలు ఫ్రీ రాడికల్‌లను శుభ్రపర్చుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, ఎంజైమ్ చర్యను నిరోధించడానికి, నైట్రిక్ ఉత్పత్తిని నివారించడానికి సహాయ పడుతాయి. ఏ, బీ, సీ, డీ, ఈ విటమిన్లు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ నిరోధకంగా కూడా ఉపయోగపడుతుంది. దోసకాయ తింటే 80 పోషక పదార్థాలు శరీరానికి లభిస్తాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. చర్మ సౌందర్యానికి కూడా ఎంతో దోహదం చేస్తాయి.
ఫ పెరిగిన గిరాకీ
బహుళ ప్రయోజనాలున్న దోసకాయలకు గిరాకీ పెరిగింది. నగర శివారుతోపాటు పలు గ్రామాల్లో రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. జిల్ల కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, మార్కెట్లలో కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. కిలో దోసకాయలు రూ.20 నుంచి 25 వరకు అమ్ముడుపోతున్నాయి. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కిలోల చొప్పున జనం కొనుగోలు చేస్తున్నారు.