Karimnagar: నాన్‌ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు షోరూంలలోనే రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:32 PM
తిమ్మాపూర్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): అన్ని రకాల నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను ఇకపై షోరూంలలోనే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి తెలిపారు.
తిమ్మాపూర్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): అన్ని రకాల నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను ఇకపై షోరూంలలోనే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో కరీంనగర్‌లోని ద్విచక్ర వాహనాలు, కార్ల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి మాట్లాడుతూ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబందించిన సాఫ్ట్‌వేర్‌ను వాహనాల డీలర్లకు ఇదివరకే అందించామని తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ను అవసరమైన శిక్షణను అందించామన్నారు. ఈ సందర్బంగా డీబీఏ శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీలర్లకు రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించారు.