Karimnagar: భక్తిశ్రద్ధలతో రథ సప్తమి
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:07 AM
కరీంనగర్ కల్చరల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రథసప్తమి పర్వదినాన్ని భక్తులు ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
జ్యోతీనగర్ వేంకటేశ్వరాలయంలో సూర్యప్రభ వాహన సేవ
కరీంనగర్ కల్చరల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రథసప్తమి పర్వదినాన్ని భక్తులు ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. సూర్యుడికి క్షీరాన్నం, పాయసం నైవేద్యంగా సమర్పించారు. సంక్రాంతి నోము నోచుకొని వారు నోములు నోచుకున్నారు. మహిళలు, యువతులు నోములు, వాయినాలు, పసుపుకుంకుమలు ఇచ్చి ముత్తైదువ లు, పెద్దల నుంచి ఆశీస్సులను పొందారు. సూర్యుడికి ప్రీతికరమైన ఆదివారం కలసి రావడంతో అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆదిత్యహృదయ స్తోత్ర, మహాసౌర, అరుణ పారాయణాలు, వాహనసేవలు జరిగాయి. ఆయా ఆలయాల్లో నిర్వాహకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.