Share News

Karimnagar: వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:27 PM

గణేశ్‌నగర్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా అందిస్తున్నామని టీజీ ఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఆర్‌ రవీందర్‌ తెలిపారు.

Karimnagar:  వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌

- ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపునకు విద్యుత్‌ శాఖ వాహనాలు

- టీజీ ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ రవీందర్‌

గణేశ్‌నగర్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా అందిస్తున్నామని టీజీ ఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఆర్‌ రవీందర్‌ తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్కిల్‌ పరిధిలో 21 విద్యుత్‌ శాఖ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి వాహనానికి జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఉంటుందని, ప్రతి వాహనాన్ని మానిటర్‌ చేస్తూ రైతులకు అసౌకర్యం కలగకుండా సత్వర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి డివిజన్‌, సబ్‌ డివిజన్‌ పరిధిలో డిపార్ట్‌మెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వాహనాలు అందుబాటులో ఉంచామని, ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే వెంటనే సంబంధిత అధికారికి తెలియజేస్తే డిపార్టుమెంట్‌ వాహనం ద్వారానే తరలిస్తున్నామని వివరించారు. విద్యుత్‌ సమస్యలు ఎదురైతే వెంటనే సమీప విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్‌ఫార్మర్‌, విద్యుత్‌ పరికరాలను తాకవద్దని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ సమస్యలు తలెత్తితే 1912 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తారని తెలిపారు.

ఫ ఆన్‌లైన్‌ విద్యుత్‌ బిల్లుల చెల్లిపు

వినియోగదారులు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించడానికి ఆసక్తి చూపుతున్నారని ఎస్‌ఈ ఆర్‌ రవీందర్‌ తెలిపారు. ప్రతి ఏటా 10 శాతం విద్యుత్‌ వినియోగదారులు తమ నెలవారీ బిల్లులను డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చెల్లిస్తున్నారని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,36,351 మంది, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1,49,068 మంది వినియోగదారులు డిజిటల్‌ విధానం ద్వారా చెల్లించారన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున, వినియోగదారులు బిల్లుల చెల్లింపు కోసం బయటకు వచ్చి ఎండ దెబ్బకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 27 , 2026 | 11:27 PM