Karimnagar: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:54 PM
ఇల్లందకుంట, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యా శాఖాధికారి ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
ఇల్లందకుంట, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యా శాఖాధికారి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను సోమవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ దార సురేష్, ఎంఈవో రాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వీణవంక: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈవో ఎన్ ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వీణవంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈవో పరిశీలించారు. పాఠశాలకు హజరైన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. అనంతరం మల్లన్నపల్లిలో మూసివేసిన పాఠశాలను పునఃప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈవో శోభారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.