Karimnagar: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:44 PM
గంగాధర, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు.
- ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం
గంగాధర, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గంగాధరలో నియోజకవర్గ స్థాయి సంబరాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర బ్లాక్ వద్ద జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ప్రధాన రహదారి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ట్రంలో వెయ్యిరోజుల సంక్షేమ పాలన పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో పదేళ్లపాటు సీఎంగా ఉన్న కేసీఆర్ రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కార్యక్రమంలో చొప్పదండి మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న, డీసీసీ నాయకుడు పద్మాకర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.