Karimnagar: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:44 PM
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
- సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు
- కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతు భరోసా, సన్న బియ్యం, ఫించన్లతోపాటు ఇతరత్రా పథకాల్లో లబ్ధిపొందుతున్న వారి వివరాలను గ్రామాల్లో అధికారులు వెల్లడిస్తారని తెలిపారు. పథకాల అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ నర్సింగరావు, సర్పంచ్ సాయిల్ల శ్రావణి మహేందర్, ఉప సర్పంచ్ హన్మంతరావు, ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, కార్యదర్శి లచ్చయ్య పాల్గొన్నారు.