Karimnagar: నిరంతరాయంగా కరెంట్ ఇవ్వండి
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:08 AM
కరీంనగర్ రూరల్, అక్టోబరు 11 (ఆంద్రజ్యోతి): వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, కరెంటు కోతలతో ఎంపిపోతున్న పంటలను కాపాడాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
- చివరి దశలో ఉన్న పొలాలను కాపాడండి
- ఎమ్మెల్యే గంగుల కమలాకర్
- గోపాల్‌పూర్‌లో రైతులతో కలిసి ధర్నా
కరీంనగర్ రూరల్, అక్టోబరు 11 (ఆంద్రజ్యోతి): వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, కరెంటు కోతలతో ఎంపిపోతున్న పంటలను కాపాడాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్‌పూర్ చౌరస్తా వద్ద రైతులతో కలిసి ఎమ్మెల్యే ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ వ్యవసాయి రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు సాగు నీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాలో తరుచూ అంతరాయాలు ఏర్పడుతండటంతో మోటార్లు, ఇతన పరికరాలు దెబ్బతింటున్నాయన్నారు. పంటలు చేతికొచ్చే దశలో నీటి కొరత ఏర్పడితే రైతుల కష్టం వృథా అవుతుందన్నారు. పంటలు ఎండిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ సర్దార్ రవీందర్‌సింగ్, దుర్శేడ్ వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు తిరుపతి, సర్పంచ్ ఆకుల గిరి, మాజీ సర్పంచ్ ఊరడి మల్లారెడ్డి, రైతు సంఘం నాయకులు మంద రాజమల్లు, నాయకులు సుంకిశాల సంపత్‌రావు, తిరుపతినాయక్ పాల్గొన్నారు.