Karimnagar: పెట్రో ధరలపై నిరసన
ABN , Publish Date - May 26 , 2026 | 11:30 PM
కరీంనగర్ అర్బన్, మే 26 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
- ఎద్దుల బండిపై కార్యాలయానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ అర్బన్, మే 26 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మంగళ వారం తన ఇంటి నుంచి సుడా కార్యాలయం వరకు ఎద్దుల బండిపై వెళ్లి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి మూడు కిలోమీటర్లు ఎద్దుల బండిపై ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను వారంలో నాలుగు సార్లు పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. సుడా కార్యాలయ సిబ్బంది కూడా సైకిల్‌పై విధులకు హాజరువుతున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు ఆకాశానికి అంటే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాటి యూపీఏ ప్రభుత్వంలో పెట్రోల్ బ్యారెల్ ధర అంతర్ఝాతీయంగా పెరిగినప్పటికీ ప్రజలపై భారం పడకుండా చేసిందన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మల్లిఖార్జున రాజేందర్, పర్వతం మల్లేశం, కాంతాల జగన్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నాయకులు పిట్టల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.