Karimnagar: సరైన మార్గదర్శకత్వం విద్యార్థుల విజయానికి మూలం
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:18 AM
భగత్‌నగర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): క్రమ శిక్షణ, సరైన మార్గదర్శకత్వం విద్యార్థుల విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
భగత్‌నగర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): క్రమ శిక్షణ, సరైన మార్గదర్శకత్వం విద్యార్థుల విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం రేకుర్తిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఐఐటీ జేఈఈ, నీట్ శిక్షణలో రెసోనెన్స్ విద్యాసంస్థలు అగ్రగామిగా ఉన్నాయన్నారు. పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది విద్యార్థులు నిర్మించుకోవాల్సి ఉందన్నారు. కరీంనగర్‌లో ఫౌండేషన్‌లో రెసోనెన్స్ విద్యా సంస్థలను అభినందించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ నర్రా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమ బద్ధమైన బోధనా పద్ధతులు నిరంతర విద్యా పర్యవేక్షణతో విద్యను అందించడానికి రెసోనెన్స్ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 50పై క్యాంపస్‌లతో విజయవంతంగా దూసుకు పోతుందన్నారు. కార్యక్రమంలో రెసోనెన్స్ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.