Karimnagar: పురపోరుకు సన్నద్ధం
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:35 PM
హుజూరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ పట్టణంలో రాజకీయ సందడి మొదలైంది.
- అభ్యర్థుల ఎంపికలో నేతలు బీజీ
హుజూరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ పట్టణంలో రాజకీయ సందడి మొదలైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, గెలుపు సాధించేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చలు, పోటీలకి ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చిన వార్డుల్లో ఆశావాహులను బుజ్జగించడం, వారిని పోటీ నుంచి తప్పించే ప్రయత్నంలో బీజీగా ఉన్నారు.
- బీ ఫామ్ కోసం విశ్వ ప్రయత్నాలు
హుజూరాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా పోటాపోటీగా పోటీదారులు పార్టీల నుంచి బీఫామ్ పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పెద్దల ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు సంబంధం లేకుండా జరగగా, ప్రస్తుతం మున్సిపల్ పోరుకు పార్టీ గుర్తులతో జరగనున్న నేపథ్యంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
- కాంగ్రెస్ట్ నుంచి ఒక్కో వార్డుకు ముగ్గురు.. నలుగురు...
మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో వార్డుకు ముగ్గురు, నలుగురు చొప్పున బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులను సర్వే ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్ అధికార పార్టీకి దీటుగా గెలుపు గుర్రాలను ఖరారు చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.
- రెబల్‌గానైనా పోటీ...
ఆర్థికంగా బలంగా, ప్రజల మద్దతు ఉన్న నాయకులకు పార్టీ టికెట్లు దక్కకపోతే స్వతంత్రులుగా బరిలో దిగడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ పార్టీకి రెబల్ అభ్యర్థులు ఎక్కువ ఉంటే ఆ పార్టీకి నష్టం జరగనుంది.