Share News

Karimnagar: ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకూడదు

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:25 PM

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి):ప్రజావాణి దరఖాస్తులను వారానికి మించి పెండింగ్‌లో ఉంచకూడదని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌రేట్‌లో

Karimnagar:  ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకూడదు

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి):ప్రజావాణి దరఖాస్తులను వారానికి మించి పెండింగ్‌లో ఉంచకూడదని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌రేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిద ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దరఖాస్తులు ఎక్కువ మొత్తంలో పెండింగ్‌లో ఉన్న శాఖలను గుర్తించి వెంటనే క్లియర్‌ చేయాలని ఆదేశించారు. దరఖాస్తులు సంబందిత శాఖకు బదిలీ కావడంలో ఆలస్యమైనా ప్రజావాణి ఆన్‌లైన్‌ దరఖాస్తులు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుపై ఎలాంటి చర్యలు తీసుకున్నదన్న విషయాన్ని అర్జీదారునికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. మొత్తం 226 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు మహేశ్వర్‌, రమేశ్‌భాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- పెన్షన్‌ ఇప్పించండి..

తనకు వందశాతం వికలాంగత్వం ఉందని, పెన్షన్‌ ఇప్పించాలని రామడుగు మండల కేంద్రానికి చెందిన ఇంతియాజ్‌ అహ్మద్‌ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు వినతి పత్రం అందచేశారు. తనకు చెవుడు ఉందని, మూగ వ్యక్తినని, తెల్ల రేషన్‌కార్డు కూడా ఉందని దరఖాస్తులో పేర్కొన్నారు.

- ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్వీ కో ఆర్డినేటర్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌ కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్‌ ధ్యావ మధుసూదన్‌రెడ్డి, శాతవాహన ఇన్‌చార్జి చుక్క శ్రీనివాస్‌, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్‌, ఎస్సారార్‌ కళాశాల అధ్యక్షుడు నాయిని అన్వేష్‌, ఆరె రవి, గంగాధర చందు, వడ్లకొండ పర్శరాములు, శ్రీకాంత్‌, విక్రమ్‌, ఓంకార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 11:25 PM