Karimnagar: ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల సేవలు విస్తరించాలి..
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:56 PM
గణేశ్‌నగర్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): కళాశాలల పరిధిలోని యూనిట్లు క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహించాలని, వలంటీర్ల సేవలు విస్తరించాలని
గణేశ్‌నగర్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): కళాశాలల పరిధిలోని యూనిట్లు క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహించాలని, వలంటీర్ల సేవలు విస్తరించాలని జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ ఇనుగాల మనోహర్ అన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయ కామర్స్ కళాశాలలో వర్సిటీ పరిధిలోని కళాశాలలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవ కార్యక్రమాలతోనే గుర్తింపు వస్తుందన్నారు. తెలంగాణ హరితదళం, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి బాధ్యుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ వ్యర్థాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. డీవైఎస్‌వో తిరుపతిరెడ్డి జాతీయ సేవా పథకం ప్రాధాన్యాన్ని వివరించారు. సమావేశంలో కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీ శ్రీరంగప్రసాద్, డిస్ట్రిక్ యూత్ ఆఫీసర్ తిరుపతిరెడ్డి, కంచు తిరుపతి, విజయ్‌కుమార్, ప్రదీప్‌రాజ్, అనిల్‌కుమార్, భాగ్యలక్ష్మి, వై ప్రసాద్ పాల్గొన్నారు.