Karimnagar: నేషనల్ ఇంటెలిజన్స్ గ్రిడ్‌ను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:02 AM
కరీంనగర్ క్రైం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): నేషనల్ ఇంటెలిజన్స్ గ్రిడ్‌ను కమిషనరేట్ పోలీసులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీపీ
కరీంనగర్ క్రైం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): నేషనల్ ఇంటెలిజన్స్ గ్రిడ్‌ను కమిషనరేట్ పోలీసులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీపీ గౌస్‌ఆలం అన్నారు. కమిషనరేట్ పరిధిలోని కోర్టు డ్యూటీ అధికారులతో ఆయన శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారెంట్ల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై అధికారులకు సీపీ అవగాహన కల్పించారు. నేషనల్ ఇంటెలిజన్స్ గ్రిడ్ ద్వారా చట్టబద్ధంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని అవసరమైన సందర్భాల్లో సమర్థవంతంగా వినియోగించుకుని, వారెంట్ల అమలును సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. పలు అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. త్వరలో నిర్వహించనున్న లోక్ అదాలత్ నేపథ్యంలో పరిష్కరించదగిన కేసులను ముందుగానే గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేలా సంబంధిత అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఫ విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి
చొప్పదండి: విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ గౌస్ ఆలం అన్నారు. చొప్పదండి పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలను సెక్టార్లుగా, సబ్ సెక్టార్లుగా విభజించి ప్రతి ప్రాంతానికొక విలేజ్ పోలీసు అధికారిని నియమించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి పాల్గొన్నారు.