Karimnagar: యుద్ధాల నియంత్రణకు మోదీ చొరవ చూపాలి
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:55 PM
భగత్‌నగర్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): యుద్ధాల నియంత్రణకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.
- చాడ వెంకట్‌రెడ్డి
భగత్‌నగర్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): యుద్ధాల నియంత్రణకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత యుద్ధంతో అంతర్జాతీయ స్థాయిలో చమురు, గ్యాస్ కొరత ఏర్పడిందన్నారు. ఇది సామాన్య ప్రజలపై భారం పడుతుంద న్నారు. బీజేపీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయని, కార్పొరేట్ సంస్థలు బాగు పడ్డాయన్నారు. పేదల బతుకులు మారలేదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య, పొనగంటి కేదారి, అందె స్వామి, కొయ్యడ సృజన్‌కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, న్యాలపట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఐ నుంచి పలువురి సస్పెండ్
పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న పలువురిని సస్పెండ్ చేస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. సోమవారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జరిగిన జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమవేశంలో మర్రి వెంకటస్వామి, కంది రవీందర్‌రెడ్డి, గరిగె శారదలను సస్పెండ్ చేస్తూ తీర్మానించినట్లు తెలిపారు.