Share News

Karimnagar: కార్పొరేట్‌కు దీటుగా వైద్యసేవలు అందించాలి

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:02 AM

సుభాష్‌నగర్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలు సమకూరాయని, ప్రజలకు కార్పోరేట్‌కు దీటుగా మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

Karimnagar:  కార్పొరేట్‌కు దీటుగా వైద్యసేవలు అందించాలి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

సుభాష్‌నగర్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలు సమకూరాయని, ప్రజలకు కార్పోరేట్‌కు దీటుగా మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి సీఎస్‌ఆర్‌ ఫండ్‌ కింద పలు కంపెనీలు అధునాతన వైద్య పరికరాలను అందించాయి. వీటిని కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఆవియోనిక్స్‌ డివిజన్‌ సంస్థలు ప్రభుత్వ ఆసుపత్రికి అధునాతన వైద్య పరికరాలు అందజేయడం అభినందనీయమన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ నవీన, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉదయ్‌ఆదిత్య పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 12:02 AM