Share News

Karimnagar: పరిసరాల పరిశుభ్రత పాటించాలి

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:38 AM

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్షణ్‌కుమార్‌ అన్నారు.

Karimnagar:   పరిసరాల పరిశుభ్రత పాటించాలి

- రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్షణ్‌కుమార్‌ అన్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున గురువారం కలెక్టరేట్‌లో స్వచ్చతా హీ సేవా కార్యక్రమాల పోస్టర్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, కలెక్టర్‌ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, ఆర్డీవో షర్మిల, డీఆర్‌డీవో గీత తదితర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ స్థాయిలో అన్ని ఆధునిక హంగులతో కరీంనగర్‌లో అంబేద్కర్‌ విజ్ఞాన భవన్‌ను నిర్మించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రాతో కలిసి జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్‌లో అంబేద్కర్‌ విజ్ఞాన్‌భవన్‌ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ కరీంనగర్‌ అంబేద్కర్‌ విజ్ఞాన్‌ భవన్‌ నిరుద్యోగ యువతకు, విద్యార్థుల కు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. భవన నిర్మాణం త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Sep 18 , 2026 | 12:38 AM