Share News

Karimnagar: ప్రలోభాలకు లొంగని క్యాతన్‌పల్లి నాయకులు

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:03 AM

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంపై ప్రజలు నమ్మక ం కోల్పోకుండా ప్రభుత్వం ఆశచూపినా ఎలాంటి

Karimnagar:   ప్రలోభాలకు లొంగని క్యాతన్‌పల్లి నాయకులు

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంపై ప్రజలు నమ్మక ం కోల్పోకుండా ప్రభుత్వం ఆశచూపినా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా క్యాతన్‌పల్లి బీఆర్‌ఎస్‌, సీపీఐ నాయకులు క్రమశిక్షణతో ప్రజాస్వామ్యాన్ని కాపాడారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌, సీపీఐకు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. అయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని కౌన్సిలర్లను భయపెడుతూ, ప్రలోభాలతో ఆశపెడుతూ మున్సిపల్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అనేక కుట్రలు, కుతంత్రాలు చేసిందని విమర్శించారు. అయినా వారి కుట్రలను భగ్నం చేసి క్యాత్‌పల్లిలో ప్రజాస్వామ్యాన్ని రక్షించామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, సుంకె రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 12:03 AM