Share News

Karimnagar: కరీంనగర్‌ కాషాయమయం

ABN , Publish Date - May 11 , 2026 | 11:53 PM

కరీంనగర్‌ కల్చరల్‌, మే (ఆంధ్రజ్యోతి) 11 : కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించే హిందూ ఏక్తాయాత్రకు సర్వం సిద్ధమైంది.

 Karimnagar:  కరీంనగర్‌ కాషాయమయం

- నేడు హిందూ ఏక్తా యాత్ర - ఏర్పాట్లు పూర్తి

- హాజరు కానున్న హంపీ పీఠాధితి విద్యారణ్య భారతీస్వామి

కరీంనగర్‌ కల్చరల్‌, మే (ఆంధ్రజ్యోతి) 11 : కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించే హిందూ ఏక్తాయాత్రకు సర్వం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి కరీంనగర్‌ వైశ్యభవన్‌ వద్ద ప్రారంభమయ్యే ఈ యాత్రకు బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగదళ్‌ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని వివిధ కూడళ్లు, పలువురు నాయకుల ఫ్లెక్సీలు, తోరణాలు, జెండాలతో కరీంనగర్‌ కాషాయమయమైంది. ఈ సారి కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. కేరళ నుంచి హనుమంతుడి విగ్రహం, హైదరాబాద్‌ నుంచి రాముడి విగ్రహం కరీంనగర్‌కు తరలించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక వేష ధారణతో ఆకట్టుకునే కళాకారులు, కేరళ నుంచి డప్పు వాయుద్య కళాకారులు రానున్నారు. సిరిసిల్ల నుంచి ఽధ్వజాలు రానున్నాయి. యాత్రలో హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

- హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయండి.

భగత్‌నగర్‌: నగరంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించే హిందు ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. హిందూ ఏక్తా యాత్ర ఏర్పాట్లను వారు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం 4 గంటలకు వైశ్య భవన్‌ నుంచి హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమవుతుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయిస్తున్నారన్నారు. హిందూ సమాజం యాత్రకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర రాజకీయాలకు అతీతంగా కొనసాగుతుందన్నారు.

Updated Date - May 11 , 2026 | 11:53 PM