Karimnagar: పన్నుల వసూళ్లలో జమ్మికుంట నం.1
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:58 PM
జమ్మికుంట, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో జమ్మికుంట మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో నిలిచింది. గడువుకు ముందే వందశాతం పన్నుల వసూళ్లు పూర్తి చేసింది.
- గడువుకు ముందే వందశాతం పన్నుల వసూళ్లు పూర్తి
జమ్మికుంట, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో జమ్మికుంట మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో నిలిచింది. గడువుకు ముందే వందశాతం పన్నుల వసూళ్లు పూర్తి చేసింది. 3.24 కోట్ల పన్నుల వసూళ్ల లక్ష్యంగా విధించగా ఆర్థిక సంవత్సరం ముగియడానికి 19 రోజుల ముందే పూర్తి చేశారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్‌కుమార్ కమిషనర్ మహమ్మద్ అయాజ్‌ను శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందు ఉండేందుకు అందరం కలిసికట్టుగా పని చేస్తామన్నారు. కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టుదల, కృషి వల్లే వరుసగా రెండోసారి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది మార్చి 16న పన్నుల వసూళ్లు పూర్తి చేశామని, ఈ ఏడాది మార్చి 11న పూర్తి చేశామని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేనేజర్ జి రాజిరెడ్డి, ఆర్‌ఐ భాస్కర్, సూపర్‌వైజర్లు వికాస్, రాజశేఖర్‌రెడ్డి, శ్రీధర్, రాజ్‌కుమార్, దీపిక, వాణి, శ్రీనివాస్, సానిటర్ ఇన్స్‌పెక్టర్లు పి మహేష్, బి సదానందం పాల్గొన్నారు.