Karimnagar: వైభవంగా జగన్నాథ రథయాత్ర
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:56 PM
కరీంనగర్ కల్చరల్, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్ర గురువారం వైభవంగా నిర్వహించారు.
కరీంనగర్ కల్చరల్, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్ర గురువారం వైభవంగా నిర్వహించారు. మహాశక్తి ఆలయం వద్ద కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పూజలు చేసి యాత్రను ప్రారంభించి రథాన్ని లాగారు. రథయాత్ర సెయింట్ జాన్స్ స్కూల్, మంకమ్మతోట, తెలంగాణ చౌక్, బస్టాండ్, వన్ టౌన్ పోలీసు స్టేషన్, మార్కెట్ రోడ్ వేంకటేశ్వరాలయం, టవర్ సర్కిల్, రాజీవ్ చౌక్ మీదుగా వైశ్యభవన్‌కు చేరుకుంది. రథయాత్రలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సెయింట్ జాన్స్ స్కూల్ వద్ద సీపీ గౌస్ ఆలం పూజలు చేశారు. తెలంగాణ చౌక్ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రథయాత్రలో పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. వైశ్యభవన్‌లో ఇస్కాన్ కరీంనగర్ ప్రతినిధి నరహరి ప్రభుదాస్ ప్రసంగించారు. మహాహారతి నిర్వహించి అన్న ప్రసాద వితరణ చేశారు. పోలీసులు పోలీసులు ఆయా చోట్ల దారి మళ్లింపు చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, ఉత్సవ కమిటీ చైర్మన్ కన్న కృష్ణ, డాక్టర్ ఎల్ రాజభాస్కర్‌రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.