Share News

Karimnagar: రవాణా శాఖ అధికారుల తనిఖీలు

ABN , Publish Date - Jun 12 , 2026 | 11:58 PM

తిమ్మాపూర్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): రవాణా శాఖ జిల్లా ప్రత్యేక స్క్వాడ్‌ అధికారులు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టి 25 వాహనాలను పట్టుకున్నారు.

Karimnagar:   రవాణా శాఖ అధికారుల తనిఖీలు

- 25 వాహనాల పట్టివేత

తిమ్మాపూర్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): రవాణా శాఖ జిల్లా ప్రత్యేక స్క్వాడ్‌ అధికారులు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టి 25 వాహనాలను పట్టుకున్నారు. ఎలాంటి పర్మిట్లు లేకుండా నడుస్తున్న రవాణా వాహనాలు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, ఇన్సూరెన్స్‌ లేని వాహనాలు, రోడ్డు టాక్స్‌ సకాలంలో చెల్లించని వాహనాలు, అధిక లోడ్‌తో ప్రయాణిస్తున్న లారీలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. వాహనాలపై భారీగా జరిమానాలు విధించినట్లు ఆర్టీవో జైపాల్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు 75 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, రవాణా నిబంధనలను ఉల్లం ఘిస్తూ పన్నులు చెల్లించకుండా వాహనాలు నడిపితే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటా యని తెలిపారు. ఈ తనిఖీ బృందంలో ఎంవిఐ రవి కుమార్‌,, ఏఎంవిఐలు రియాజ్‌, కీర్తి , ఉదయ్‌, శృతి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Updated Date - Jun 12 , 2026 | 11:58 PM