Share News

Karimnagar: ముగిసిన వ్యాయామ ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:46 PM

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ గత మూడు రోజులుగా నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాయామ ఉపాధ్యాయుల అంతర్గత వృత్యంతర శిక్షణ

Karimnagar: ముగిసిన వ్యాయామ ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ గత మూడు రోజులుగా నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాయామ ఉపాధ్యాయుల అంతర్గత వృత్యంతర శిక్షణ గురువారం ముగిసింది. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించిన ఈ శిక్షణ ముగింపు సమావేశంలో శిక్షణ పర్యవేక్షణాధికారి గెజిటెడ్‌ మాస్టర్‌ నరసింహారెడ్డి మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అన్ని విషయాలను వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల స్థాయిలో అమలు చేయాలన్నారు. పాఠశాల స్థాయిలో క్రమశిక్షణ పెంపొందించేందుకు ప్రధానోపాధ్యాయుల అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులే ముఖ్యమని పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు కూడా పాఠశాలల్లో ప్యానల్‌ బోర్డులను ఉపయోగించుకొని విద్యార్థులకు వివిధ క్రీడలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి బి వేణుగోపాల్‌, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు బాబు శ్రీనివాస్‌, కార్యదర్శులు ఆడెపు శ్రీనివాస్‌, సీహెచ్‌ శ్రీనివాస్‌, డీఆర్‌పీలు ఆర్‌ నర్సయ్య, అంతటి శంకరయ్య, కనకం సమ్మ య్య, బి జ్యోతి, క్రీడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 11:46 PM