Share News

Karimnagar: ప్రతి ఇంటి సమాచారం నమోదు చేయాలి

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:00 AM

కరీంనగర్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటి సమాచారం నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ చిత్రామిశ్రా అన్నారు.

Karimnagar: ప్రతి ఇంటి సమాచారం నమోదు చేయాలి

- కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటి సమాచారం నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ చిత్రామిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో మన జనాభా గణన - మన అభివృద్ధి అనే నినాదంతో జనాభా గణన-2027కు సంబంధించిన ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభా గణన దేశంలో అతిపెద్ద ప్రజల భాగస్వామ్య కార్యక్రమన్నారు. ప్రతి ఇంటి సమాచారం నమోదు చేసుకోవడం అందరి ప్రథమ కర్తవ్యమన్నారు. ప్రజలంతా పెద్ద ఎత్తున ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు. జనాభా గణన తొలి దశ మే 11 నుంచి జూన్‌ 9 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ దశలో ఎన్యుమరేటర్లు ఇళ్ల జాబితా, గణన చేపడుతారన్నారు. దీనికి ముందు ఏప్రిల్‌ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వీయగణన (సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌) పూర్తి చేయాలన్నారు. దీని కోసం సెన్సెస్‌ వెబ్‌సైట్‌ను సందర్శించి స్వీయ గణన ఐడి పొందాలన్నారు. అనంతరం ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు ఆ ఐడి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు సందర్శకులకు అవగాహన కల్పిం చే ఉద్దేశంతో ఈ ప్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. జనాభా గణన విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి రాం దత్తారెడ్డి, జిల్లా సెన్సెన్‌ అధికారి తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 12:00 AM